Welcome, Guest   [ Register | Sign In | Take a tour | Adult Filter: On ]

మా తెలుగు తల్లికి మల్లె పూదండ (Second Version)

Loading....
Sankarambadi Sundarachari
------------------------------------
Lyrics

మా తెలుగు తల్లికి మల్లె పూదండ
మాకన్నతల్లికి మంగళారతులు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
కడుపులో బంగారు కనుచూపులో కరుణ
కడుపులో బంగారు కనుచూపులో కరుణ
చిరునవ్వులో సిరులు దొరలించు నాతల్లి
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
గలగలా గోదారి కదలి పోతుంటేను
గలగలా గోదారి కదలి పోతుంటేను
బిరబిరా కృష్ణమ్మ పరువులిడుతుంటేను
బంగారు పంటలే పండుతాయి
బంగారు పంటలే పండుతాయి
మురిపాల ముత్యాలు దొరలుతాయి
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
అమరావతి గుహల అపురూప శిల్పాలు
అమరావతి గుహల అపురూప శిల్పాలు
త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు
తిక్కయ్య గళములో తియ్యందనాలు
నిత్యమై నిఖిలమై నిలిచియుండేదాక
రుద్రమ్మ భుజశక్తి మల్లమ్మ పతిభక్తి
తిమ్మరసుని యుక్తి కృష్ణరాయని కీర్తి
వాద్యములరింపుమని మారుమోగేదాక
మీ పాటలే పాడుతాం నీ ఆటలే ఆడుతాం
జై తెలుగుతల్లీ … జై తెలుగుతల్లీ
Embed:
నిరాకరణ